'ఆర్ ఆర్ ఆర్ ' అంటే ??


'ఆర్ ఆర్ ఆర్' కోసం చిత్రసీమ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 'బాహుబలి' తరవాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రమిది. అగ్ర కథానాయకులు రామ్ చరణ్, ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో 'ఆర్ ఆర్ ఆర్'కి సంబంధించిన ప్రతి చిన్న విషయం ఆసక్తి రేపుతోంది. 'ఆర్ ఆర్ ఆర్' అనే పొడి అక్షరాల్ని ప్రతిబింబించే టైటిల్ పెట్టమంటూ ఇదివరకే రాజమౌళి అభిమానుల్ని కోరారు. ఈ చిత్రానికి ' రామ రౌత్ర రుషితం' అనే పేరు బాగుంటుందని అనుకుంటున్నారట. మిగిలిన భాషల్లో 'రైజ్ రివోల్ట్ రివెంజ్' పేరుతో విడుదల కానుందని తెలుస్తోంది.