మాల్స్త రహాలో వ్యవసాయ క్షేత్రాలు

 



జర్మనీ తరహాలో తెలంగాణ రాష్ట్రంలోనూ పంట కాలనీలతోపాటు మాల్స్ తరహాలో వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటుకు ప్రోత్సాహం ఇస్తామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.జర్మనీ పర్యటనలో భాగంగా బెర్లిన్ సమీపంలో ఉన్న సమీకృత వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన సందర్శించారు. ఇలాంటి క్షేత్రాలకు అక్కడ మంచి ఆదరణ ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రయోగాత్మకంగా ఇలాంటివి ఏర్పాటు చేస్తే ఆదరణ లభించే అవకాశం ఉందన్నారు.