అక్టోబర్ 10న 'హరికేన్ ఈవో స్పైడర్' విడుదల సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్గిని భారత మార్కెట్లోకి సరికొత్త 'హరికేన్ ఈవో స్పైడర్'ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అక్టోబర్ 10న ఈ కారును భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో లంబోర్గిని ముంబయిలో కొత్త షోరూమ్ ను ప్రారంభించనుంది. సాధారణ కూపే వెర్షన్ తో పోలిస్తే హరికేన్ ఈవో దాదాపు | 120 కిలోల బరువు అధికంగా ఉంది. ఈ కొత్త కారులో ఎలక్ట్రో హైడ్రాలిక్ రూఫ్ ఫోల్డింగ్ వ్యవస్థను అమర్చారు. 50 | కిలోమీటర్ల వేగంతో ప్రయణించేటప్పుడు కేవలం 17 క్షణాల్లో కారు రూఫన్ను మడతపెట్టేస్తుంది.
హరికేన్ ఈవో