వివాహబంధం సాఫీగా సాగాలంటే ఆలుమగలు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవాలని మహేశ్ బాబు అన్నారు. నమ్రతతో తన వివాహబంధం గురించి ఈ ఇంటర్వ్యూలో మహేశ్ మాట్లాడుతూ.. 'మా పెళ్లి జరిగి 14 ఏళ్లు అయ్యింది. మేము ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నాం. వివాహబంధం బలపడాలంటే ఒకే ఒక్క రహస్యం.. కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం. ఇంతటి గొప్ప విషయాన్ని నాకు నేర్పించింది మా నాన్న. ఇంటికి రాగానే ఆయన మాతో చాలా సంతోషంగా గడుపుతారు.' అని మహేశ్ తెలిపారు.
ఒకరిని ఒకరు అర్ధం చేసుకోవడమే జీవితం . . . సూపర్ స్టార్ మహేష్