వాట్సప్ మెసేజ్ లు మాయం ..!


 'వాట్సాప్' సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. మనం పంపిన, మనకొచ్చిన సందేశాలను పనిగట్టుకుని తొలగించుకోవాల్సిన పని ఇక ఉండకపోవచ్చు. ఎందుకంటే... పరిమిత సమయం దాటిన ఆయా సందేశాలు వాటంతట అవే కనిపించకుండాపోయే సౌలభ్యాన్ని వాట్సాప్ అందుబాటులోకి తెస్తోంది. వినియోగదారులు ఈ ఆప్షనన్ను ఎంపిక చేసుకోవడమే కాకుండా, సమయ పరిమితిని కూడా నిర్దేశించుకోవచ్చని తెలుస్తోంది. ఈ కొత్త ఫీచర్‌ను ప్రస్తుతం ఆండ్రాయిడ్ లో పరీక్షించి చూస్తున్నట్టు సమాచారం.