19 వ తేదీ వరకు దసరా సెలవులు పొడిగింపు


 RTC సమ్మెకారణంగా విద్యార్ధులు ఇబ్బందులు పడకుండా విద్యాసంస్థలకు సెలవులను ఈ నెల 19వ తదీ వరకూ పొడిగించాలని ముఖ్యమంత్రి KCR అధికారులను ఆదేశించారు. అప్పటిలోగా పూర్తిస్థాయిలో బస్సులు సమకూర్చుకోవాలని అధికారులకు సూచించారు. ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా మరిన్ని ప్రైవేట్ బస్సుల కోసం నోటిఫికేషన్ జారీ చేయాలని కూడా సీఎం KCR అధికారులను ఆదేశించారు.