వజ్రకరూర్ లో వజ్రాల వేట

 



 రాయలసీమలో ఇటీవల కురుస్తున్న వర్షాలతో అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలో వజ్రాల వేట మొదలైంది. జిల్లా నలుమూలల నుంచి వందల సంఖ్యలో ప్రజలు తరలివచ్చి వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు. కొందరు భోజనాలు కూడా తెచ్చుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకూ పొలాల్లో కలియదిరుగుతున్నారు. ఇక్కడ లభ్యమైన వజ్రాలను గుట్టు చప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఏటా జూన్ నెలలో తొలకరి వర్షాలు కురిసిన వెంటనే ఈ ప్రాంతంలో వజ్రాల  వేట మొదలవుతుంది.వజ్రాలు దొరికిన వాళ్లకు ఆరు నెలలు నుంచి ఏడాది కి సరిపడా ఆదాయం లభించినట్లే .