ఇక అక్కడ కూడా పంటలు పండించవచ్చు


అమెరికా, రష్యా, ఐరోపా సమాఖ్య దేశాలు అంగారక, చంద్ర గ్రహాలపై స్థావరాలు ఏర్పాటు చేసుకొనేందుకు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. 2028 నాటికి చంద్రుడిపై మనుషులకు స్థిర నివాసం ఏర్పాటు చేయాలని నాసా ప్రణాళికలు వేస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రుడు లేదా అంగారక గ్రహాలపై మనుషులు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటే అక్కడ ఆహార భద్రత పెను సవాలుగా మారే అవకాశం ఉంది. చంద్రునితో పాటు అంగారక గ్రహం ఉపరితలంపై పంటలు పండించవచ్చని నెదర్లాండక్కు చెందిన వేజ్ నింగెన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు గుర్తించారు.