ఐఏఎఫ్ అంకితభావం భేష్: మోదీ

 


న్యూఢిల్లీ: భారతదేశ 87వ 'ఎయిర్ ఫోర్స్ డే' సందర్భంగా వాయుసేన యోధులు, వారి కుటుంబాలకు నేడు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత వాయుసేన దేశానికి నిబద్ధత, ప్రతిభతో కూడిన సేవలను కొనసాగిస్తోందని కొనియాడారు. వాయుసేన ఇలాగే నిబద్ధతతో కూడిన ప్రతిభావంతమైన సేవలను కొనసాగించాలని అభిలషిస్తున్నాం' అని ప్రధాని ఓ ట్వీట్ లో పేర్కొన్నారు.