విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు విగ్రహం ఆవిష్కరణ


పశ్చిమగోదావరి  జిల్లా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని ప్రముఖ సినీనటుడు చిరంజీవి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు. తాడేపల్లి గూడెంలోని ఎస్వీఆర్ సర్కిల్, కె.యన్.రోడ్ లో ఏర్పాటు చేసిన 9.3 అడుగుల విగ్రహాన్ని గతంలోనే ఆవిష్కరించాలని తొలుత భావించారుకానీకొన్ని అనివార్య కారణాలవల్ల దీనిని వాయిదా వేశారు.