వేపాకును వేడి నీటిలో నానబెట్టి స్నానానికి ఉపయోగిస్తే శరీరం మీద ఉన్న ఎటువంటి మచ్చలు అయినా త్వరగా పోతాయి. వేపాకు మరిగించిన నీటితో తలస్నానం చేస్తే జుట్టు ఊడటం తగ్గి నల్లగా, పొడవుగా పెరుగుతుంది. ఒక కప్పు వేపాకులు మరిగించి చల్లార్చిన తర్వాత ఆ నీటిని వడకట్టి ఆ నీటితో ముఖాని కడుక్కుంటే ఆయిల్ స్కిన్ వారికి మంచి ఫలితం ఉంటుంది.వేపాకు పేస్టు వాడటం ద్వారా ముఖం మీది మచ్చలు పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.