అంధత్వ సమస్య ఉన్నవారిలో కంటిచూపును పునరుద్ధరించే దిశగా అమెరికా శాస్త్రవేత్తలు ఒక కీలక ముందడుగు వేశారు. కంట్లో అమర్చే కృత్రిమ రెటీనా రూపకల్పనలో ఉన్న పెద్ద అడ్డంకిని వారు అధిగమించారు. కృత్రిమ డిజిటల్ రెటీనాల సాకారానికి దశాబ్దాలుగా పరిశోధనలు సాగుతున్నాయి. తాజాగా స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కంట్లోని న్యూరాన్లు సృష్టించే భారీ దృశ్య డేటాను గణనీయంగా కుంచింపచేయడం ద్వారా అన్ని సమస్యలను అధిగమించే విధానాన్ని కనుగొన్నారు.
కృత్రిమ రెటీనాతో కంటి వెలుగులు