ఒడిశాలో ఉన్న తన థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును విక్రయించేందుకు జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా జేఎడబ్ల్యూ ఎనర్జీతో చర్చిస్తోంది. ఈ రెండు సంస్థలూ చర్చలకు సంబంధించిన విషయాన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చాయి. జీఎంఆర్ ఎనర్జీకి అనుబంధంగా కొనసాగుతున్న జీఎంఆర్ కమలనాగ ఎనర్జీ లిమిటెడ్ నిర్వహిస్తోన్న 1050 మెగావాట్ థర్మల్ పవర్ కేంద్రాన్ని స్వాధీనం చేసుకునేందుకు చర్చలు జరిగాయని జేఎడబ్ల్యూ ఎనర్జీ బీఎస్ఈకి ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది.
థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని విక్రయించిన GMR