ముక్కు ముఖం మీద బ్లాక్ హెడ్స్ పోవాలంటే...

 



 ఒక చెంచా సాల్ట్ ను బౌల్లో వేసి అందులో ఒక చెంచా రోజ్ వాటర్ మిక్స్ చేసి వెంటనే అది కరిగి పోకుండానే ముఖానికి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో కొద్దిగా అలాగే అప్లై చేయాలి . సాల్ట్ బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది . అలా వారానికి ఒకసారి చేయాలి.సాల్ట్ మరియు షుగర్ రెండు ఒక్కొక్కో చెంచా తీసుకొని రెండింటిని మిక్స్ చేసి అందులో కొద్దిగా రోజ్ వాటర్ లేదా పాలు మిక్స్ చేసి దీన్ని ముఖానికి పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి. 15 నిముషాల తర్వాత తడి కాటన్ వస్త్రంతో తుడిచేస్తే ముక్కు మీద బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.