టీమిండియా యువ ఆటగాడు మనీశ్ పాండే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. దక్షిణాది నటి అర్షితా శెట్టి (26)ని అతడు పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ 2న ముంబయిలో వీరిద్దరూ ఒక్కటికాబోతున్నారని సమాచారం. చాన్నాళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. ఎన్నాళ్ల నుంచో విందు, వినోదాలకు చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతున్నారట. ప్రస్తుతం మనీశ్ విజయ్ హజారే టోర్నీలో కర్ణాటక జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు.