ఒకరి పై ఒకరు కేసులు పెట్టుకున్న ఇద్దరు నిర్మాతలు

 


ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి. పొట్లూరిపై (వీవీపీ) నిర్మాత బండ్ల గణేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పీవీపీ, ఆయన అనుచరులు తనకు హాని కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని, రక్షణ కల్పించాలని బంజారాహిల్స్ పొలీసులను కోరినట్లు తెలుస్తోంది. మరోపక్క పీవీపీ శుక్రవారం రాత్రి గణేశ్ పై జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు. 'టెంపర్' సినిమా సమయంలో తనకు బాకీపడ్డ సొమ్ము ఇవ్వాలని కోరితే.. బండ్ల గణేశ మనుషులు తన ఇంటికి వచ్చి బెదిరింపులకు పాల్పడ్డారని పీవీపీ ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు ప్రముఖ నిర్మాతలు ఒకరి పై ఒకరు ఇలా కేసులు పెట్టుకోవటం ఫిలింనగర్ లో పెద్ద చర్చగా  మారింది .