ఇటీవల దసరా సెలవుల్లోనూ మహేష్ బాబు విహారం కోసం స్విట్జర్లాండ్ వెళ్లారు. భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి ఇష్టమైన ప్రదేశాలన్నీ చుట్టేసి వెనుదిరిగారు. "నేను తిరిగి చిత్రీకరణకి, గౌతమ్ స్కూల్ కి" అంటూ సెలవులు ముగిసిన విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు మహేష్. త్వరలోనే 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం కోసం రంగంలోకి దిగనున్నారు మహేష్. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
సెలవులు ముగిశాయి అంటున్నమహేష్