అధిక రక్తపోటు నియంత్రణ మాత్రలను పగటిపూట కంటే రాత్రి నిద్రకు ఉపక్రమించబోయే ముందు వేసుకోవడం వల్లే ఎక్కువ ప్రయోజనమట! ఇలా చేయడం వల్ల గుండె పోటు నుంచి 42%, పక్షవాతం నుంచి 50%, హృదయానికి రక్తం సరఫరాలో సమస్య నుంచి 44% ఉపశమనం కలగడమే కాకుండా... ఆ మేరకు మరణ ముప్పును తప్పించుకోవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. స్పెయిన్లోని యూనివర్సిటీ ఆఫ్ వీగోకు చెందిన పరిశోధనకర్త రమోన్ సి.హెర్మిడా నేతృత్వంలోని బృందం ఈ విషయాలను వెల్లడించింది .
బీపీ మాత్రలను రాత్రిపూట వేసుకుంటున్నారా ?