PV సింధు కు ఘన సత్కారం

 


భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కేరళలో సందడి చేసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ విజేతగా నిలిచిన సింధును కేరళ రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది. ఆ రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు రూ. 10 లక్షల చెక్కును అందజేశారు. అనంతరం జరిగిన సన్మాన సభలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ సింధును కొనియాడారు. 2020 టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం గెలవడమే తన తర్వాత లక్ష్యమని సింధు తెలిపింది.