తిరుమల: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు తుది అంకానికి చేరుకున్నాయి. ఉదయం శ్రీవారికి చక్రస్నానం నిర్వహించారు. అనంతరం TTD ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ.. గత 8 రోజుల్లో 7.20 లక్షల మంది స్వామి వారిని దర్శించుకున్నారని, బ్రహ్మోత్సవాల్లో 32 లక్షల లడ్డూలు విక్రయించామని, గతేడాది కంటే అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారని తెలిపారు. అదనపు లగేజీ కౌంటర్ల ఏర్పాటుతో గరుడ సేవ రోజున సమస్యలు రాలేదని పేర్కొన్నారు.
7.20 లక్షల మందికి స్వామి దర్శనం: TTD