మర మనుషుల్లో సున్నితత్వాన్ని పెంచే దిశగా జర్మనీలోని మ్యూనిక్ సాంకేతిక విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కీలక ముందంజ వేశారు. పూర్తి శరీరం కృత్రిమ చర్మంతో కప్పి ఉన్న హ్యూమనాయిడ్ రోబోను తొలిసారిగా అభివృద్ధి చేశారు. తాజా ఆవిష్కరణలో భాగంగా శాస్త్రవేత్తలు తొలుత అంగుళం వెడల్పున్న షడ్భుజి ఆకారపు కణాలతో కృత్రిమ చర్మాన్ని తయారుచేశారు. ప్రతి కణంలో మైక్రోప్రాసెసర్, సెన్సర్లను పొందుపర్చారు. అవి స్పర్శ, ఉష్ణోగ్రత, ఇతర వస్తువులతో దూరం వంటి అంశాలను స్పష్టంగా గుర్తిస్తాయి.
కృత్రిమ చర్మంతో హ్యూమనాయిడ్ రోబో