CM కేసిఆర్ ప్రత్యేక పూజలు

 


హైదరాబాద్ : విజయదశమి పురస్కరించుకుని తెలంగాణ CM కేసీఆర్ అధికారిక నివాసంలో వాహనపూజ, ఆయుధ పూజ నిర్వహించారు. ప్రగతిభవన్ నల్లపోచమ్మ దేవాలయంలో సీఎం కుటుంబ సమేతంగా పూజలు చేశారు. ఆయుధపూజ అనంతరం పాలపిట్ట దర్శనం చేసుకున్నారు. ఉద్యోగులు, కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు.