మధ్యప్రాచ్యంలో వ్యవహారాల పర్యవేక్షణకు అమెరికా తన సైనిక శక్తి వినియోగించడం అతి పెద్ద తప్పిదమని ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. మధ్య ప్రాచ్య వ్యవహారాల పర్యవేక్షణకు అమెరికా ఇప్పటివరకూ 8 లక్షల కోట్ల డాలర్లు( రూ. 5.6 కోట్ల కోట్లు) ఖర్చుచేసింది. ప్రాణాలు పోగొట్టుకున్న సైనికులు, క్షతగాత్రులైన వారు వేలల్లో ఉన్నారు. మధ్యప్రాచ్యంలో కూడా అనేక మంది అసువులు బాశారు. మధ్యప్రాచ్యం వ్యవహరాల్లో అమెరికా కలుగచేసుకోవడం పెద్ద తప్పిదం" అని ట్రంప్ ట్వీట్ చేశారు.
అమెరికా చేసిన పెద్ద తప్పు అదే