హైదరాబాద్లోస్టెంట్ల తయారీ పరిశ్రమ

సుల్తాన్ పూర్ మెడికల్ డివైజ్ పార్క్లో ఏర్పాటు


గుండెకు సాఫీగా రక్తం సరఫరా అయ్యేలా ఉపకరించే స్టెంట్ల తయారీ పరిశ్రమ నిర్మాణ పనులకు సెప్టెంబర్ 1న భూమిపూజ జరిగింది. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం సుల్తాన్ పూర్లో ప్రభుత్వం ఏర్పాటుచేసిన మెడికల్ డివైజెస్ పార్క్లో స్టెంట్ల తయారీ పరిశ్రమను నెలకొల్పేందుకు గుజరాత్ కు చెందిన సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ (ఎస్ఎంటీ) యాజమాన్యం ముందుకొచ్చింది. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను స్థాపిస్తున్నా. ఏటా 1.25 మిలియన్ స్టెంట్లు తయారుచేయాలన్న లక్ష్యంతో నిర్మిస్తున్న ఈ పరిశ్రమలో 2,200 మంది ప్రత్యక్షంగా, 500 మంది పరోక్షంగా ఉపాధి పొందనున్నారు. సహజానంద్ సెంట్ల తయారీ పరిశ్రమ నిర్మాణం పనుల భూమిపూజకు మంత్రులు ఈటల రాజేందర్, చామకూర మల్లారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. | ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల మాట్లాడుతూ.. అభివృద్ధి, పెట్టుబడుల విషయంలో నిన్నమొన్నటి వరకు గుజరాత్, మహారాష్ట్ర పేర్లు వినబడేవని, పెట్టుబడులకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం స్వర్గధామంగా మారిందని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని తెలిపారు. ఆసియాలోనే అతి పెద్ద స్టెంట్ల పరిశ్రమను సహజానంద్ సంస్థ హైదరాబాద్ లో నిర్మించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. సెంట్ల ధరలు సామాన్యుడికి అందుబాటు లోకి రావాల్సిన అవసరం ఉన్నదని, ఇందుకు సహజానంద్ పరిశ్రమ పరిశోధనలు జరుపాలని సూచించారు. స్థానిక ఉద్యోగావకాశాలు కల్పించాలని, అవసరమైతే శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలని కోరారు. హైదరాబాద్ లో నిర్మిస్తున్న ఆసియాలోనే అతి పెద్ద స్టెంట్ల పరిశ్రమ తమ సంస్థకు చారిత్రక మైలురాయి వంటిదని సహజానంద్ గ్రూప్ చైర్మన్ ధీరజ్లాల్ కొటాడియా చెప్పారు. ఇప్పుడు ఆసియాలోనే పెద్దదిగా ఉన్నాం, రానున్న ఆరేడేండ్లలో ప్రపంచంలోనే నంబర్ వన్ పరిశ్రమగా మారుతామని ధీమా వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్, టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందిస్తున్న 



సహకారానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జెడ్పీ వైస్చైర్మన్ ప్రభాకర్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, వైస్ చైర్మన్ నరసింహారెడ్డి, గురుకుల్ పీఠానికి చెందిన దేవ్క ృష్ణాదాస్ స్వామి, ధర్మవల్లభ దాస్ స్వామి, కలెక్టర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమించి సాధించుకొన్న తెలంగాణలో.. ఒక్కొక్కటి సాకారం అవుతున్నాయని కార్మిక, ఉపాధి కల్పనాశాఖల మంత్రి చామకూర మల్లారెడ్డి చెప్పారు. పరిశ్రమల స్థాపనతో స్థానికులకు ప్రత్యక్షంగా, పరో క్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అన్నిరంగాల్లో రాష్ట్రం చరిత్ర సృష్టిస్తున్నదని, పారిశ్రామికంగా కూడా నంబర్ వన్గా తయారవు తున్నామని తెలిపారు. పరిశ్రమలు, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. మెడికల్ డివైజెస్ పార్క్ ఏర్పాటుతో సుల్తాన్ పూర్ దేశంలోనే గుర్తింపు పొందనుందన్నారు. ఇప్పటికే ఈ పార్క్లో 22 పరిశ్రమలకు స్థలాలు కేటాయిం చామని, ఈ పరిశ్రమలు వెయ్యి కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు. పరిశ్రమలంటే ఒకప్పుడు గుజరాత్ గుర్తుకు వచ్చేదని, ఇప్పుడు అక్కడి నుంచి కూడా పరిశ్రమలు తెలంగాణకు తరలి వస్తున్నాయని తెలిపారు.