సోషల్ మీడియా దుర్వినియోగం.. కేంద్రమే స్పందించాలన్న సుప్రీం
సోషల్ మీడియా విస్తరిస్తున్న తీరును పట్టి సు ప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. టెక్నాలజీ చాలా ప్రమాదకరమైన మలుపు తీసుకుందని కోర్టు అభిప్రాయపడింది. అయితే సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు కావాల్సిన మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం కోరింది. దీని కోసం ఎంత సమయం కావాలో కేంద్రం మరో మూడు వారాల్లోగా చెప్పాలని కోర్టు తన తీర్పులో అభిప్రాయపడింది. సోషల్ మీడియాలో తప్పుడు మెసేజ్‌లు, సందేశాలు ఇస్తున్న వారిని గుర్తించడంలో ఆయా ప్లాట్‌ఫామ్‌లు విఫలమైన అంశంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీపక్ గుప్తా, అనిరుధ్ బోస్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ ఈ అంశాన్ని కోర్టు విచారించింది.
కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యపై నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందని కోర్టు చెప్పింది. శాస్త్రీయ సమస్యను పరిష్కరించేందుకు హైకోర్టు కానీ, సుప్రీం కానీ సరైంది కాదని ధర్మాసనం వెల్లడించింది. ఇలాంటి సమస్యలకు కేంద్రమే పరిష్కారమే చూపాలని కోర్టు అభిప్రాయపడింది
సోషల్ మీడియా దుర్వియోగం ..కేంద్రమే స్పందించాలి