కోడిపందాలు సంప్రదాయ క్రీడల్లో భాగం


 సంక్రాంతి వేడుకల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం సీసలలో ఏర్పాటుచేసిన కోడిపందాలను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోడి పందాలు సంప్రదాయ క్రీడల్లో ఒక భాగమని అన్నారు. గోదావరి జిల్లాలు సంక్రాంతి వేడుకలకు పెట్టింది పేరు అని కొనియాడారు. కోడిపందాలు ఆనవాయితీగా వస్తున్నాయని, వీటిని జూదంగా చూడొద్దని కోరారు.