పురపాలిక ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తయింది. ఈ మేరకు ఎన్నికల సంఘం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు జిల్లాలో 1770 పోలింగ్ కేంద్రాలు ఎన్నికల కోసం గుర్తించారు. రంగారెడ్డి జిల్లాల్లో మూడు కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలు ఉండగా 938 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మేడ్చల్ జిల్లాలో 832 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఈ నెల 22న ఆయా మున్సిపాలిటీలు/ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి.
1770.. పోలింగ్ కేంద్రాలు