పెట్రోల్ బంక్ లో పెట్రోలు కు బదులుగా నీరు


 నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం పరిధిలోని శ్రీ చక్ర పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్లో 40 ద్విచక్ర వాహనాల్లో పెట్రోలు పోయగా... అన్నింటిలోనూ నీరే వచ్చింది. దీంతో వాహనాలు దారి మధ్యలోనే ఆగిపోడటంతో బాధితులు బంకు వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. స్థానిక ఎస్సై శివప్రసాద్ సిబ్బందితో కలిసి పెట్రోల్ బంకు వద్దకు చేరుకుని నమూనాలు సేకరించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.