6 గంటల వ్యవధిలో ఆరగిస్తే ఆయుర్దాయం పెరుగుదల


క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధుల నివారణకు 'ఉపవాసం' అద్భుత సాధనంలా పనికొస్తుందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. రోజులో ఆరగించే ఆహారాన్ని కేవలం 6 గంటల వ్యవధిలోనే తీసుకొని.. మిగతా 18 గంటలపాటు ఉపవాసం పాటించడం ద్వారా మనుషులు ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు పొందవచ్చునని నిర్ధారించింది. గుండె ఆరోగ్యం మెరుగుదల, రక్తపోటు నియంత్రణ, బరువు తగ్గుదల, ఆయుర్దాయం పెరుగుదలకు ఈ విధానం దోహదపడుతుంది.